Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలు బయటపెట్టకుండానే బెంగుళూరు వైద్యుడికి ఒమిక్రాన్!!

కాలు బయటపెట్టకుండానే బెంగుళూరు వైద్యుడికి ఒమిక్రాన్!!
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:21 IST)
దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు వెలుగు చూశాయి. ఈ రెండు కేసులు కూడా బెంగుళూరులోనే నమోదయ్యాయి. వీరిలో ఒకరు వైద్యుడు. మరొకరు విదేశస్థుడు. ఈ వైరస్ సోకిందని తెలియగానే విదేశస్థుడు తన దేశానికి వెళ్లిపోయాడు. అయితే, బెంగూళూరు డాక్టరు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పైగా, ఈయన్ను కలిసిన మరో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరందరి ఆరోగ్యం బాగానే ఉంది. 
 
ఈ నేపథ్యంలో బెంగుళూరు వైద్యుడికి ఒమిక్రాన్ వైరస్ ఎలా సోకిందన్న అంశంపై ఇపుడు చర్చ సాగుతోంది. ఆయనకు ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాలకు ఎక్కడికీ ప్రయాణించలేదు. ఆయన ఎక్కడుకు వెళ్లకుండానే ఒమిక్రాన్ వైరస్ సోకింది. గత నెల 21వ తేదీన ఈ వైద్యుడుకి జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయి. మరుసటి రోజు ఆర్టీపీసీఆర్ టెస్టుల అతిడికి పాజిటివ్ అని తేలింది. 
 
ఆ తర్వాత ఆయన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ పరీక్షకు ఈ నెల 24వ తేదీన పంపించారు. మూడు రోజుల తర్వాత అంటే గత నెల 27వ తేదీన ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. అయితే, ఈ వైద్యుడు శాంపిల్స్‌కు జరిపిన పరీక్షల్లో ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. పైగా, ఈయన ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే ఒమిక్రాన్ సోకిందని బృహత్ బెంగుళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) రికార్డులు వెల్లడిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలుష్యం పాకిస్థాన్ నుంచి వస్తోంది.. యూపీ : అక్కడి పరిశ్రమలు మూయించాలా?