ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సంతాప సందేశాన్ని కవిత్వంలో ప్రారంభించి.. చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చ
ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సంతాప సందేశాన్ని కవిత్వంలో ప్రారంభించి.. చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం పట్ల నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. నారా లోకేష్ ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. నారో లోకేష్‌కు రాజకీయాల పట్ల ఇంకా అవగాహన రాలేదని ఎద్దేవా చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే.. వాజ్‌పేయ్ కన్నుమూత సందర్భంగా లోకేష్ విడుదల చేసిన సంతాప సందేశంపై సోషల్ మీడియాలో మూడు రోజులుగా సెటైర్లు పేలుతున్నాయి. సంతాప సందేశంలో వాజ్‌పేయ్ కంటే తన తండ్రి చంద్రబాబు నాయుడినే లోకేష్ ఎక్కువగా ప్రస్తావించడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
గతంలో ప్రసంగంలో పొరపాట్లు చేసి నోరుజారి నారా లోకేష్ పరువు తీయించుకున్న సందర్భాలున్నాయి. అలాగే గతంలో అంబేద్కర్ జయంతి సభలో పాల్గొని వర్థంతి అంటూ తప్పుగా మాట్లాడడంతో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఏపీ మంత్రి హోదాలు వుండి వర్థంతికి, జయంతికి తేడా తెలియక నారా లోకేష్ మాట్లాడటంపై జోకులు పేలిన సంగతి తెలిసిందే.