అటల్ జీకి నివాళిని వ్యతిరేకించి.. చెప్పులతో చెంప దెబ్బలు తిన్నాడు..
దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. భారత జాతి ముద్దుబిడ్డ ఇక లేరనే వార్తను దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో భ
దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. భారత జాతి ముద్దుబిడ్డ ఇక లేరనే వార్తను దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రముఖ రాజకీయ నేతలు, ఇతర దేశాల నేతలు సైతం ఢిల్లీకి వచ్చి వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
అయితే అటల్ జీ అంత్యక్రియల వేళ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీజేపీ, ఎంఐఎం మధ్య గొడవ జరిగింది. అటల్‌జీ మృతి పట్ల సంతాపం తెలిపే తీర్మానాన్ని వ్యతిరేకించినందుకు ఎంఐఎం కార్పొరేటర్‌పై బీజేపీ సభ్యులు దాడికి దిగారు. వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశమైంది. నివాళులర్పిస్తున్నసమయంలో ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మతీన్ వ్యతిరేకించారు. మహానేతను తలుచుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తుండగా అడ్డుకున్నారు. ఆయనకు ఎందుకు నివాళి అర్పించాలని, తాను ఆ పని చేయనని అన్నారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు మతీన్‌పై దాడి చేశారు.
పురుష కార్పొరేటర్లు పిడిగుద్దులు గుద్దితే, మహిళా కార్పొరేటర్లు చెప్పులతో చెంపలు వాయించారు. మేయర్ వద్దని చెప్పిన ఏ కార్పొరేటర్ కూడా దాడిని ఆపలేదు. ఆఖరికి పోలీసులు రావడంతో బతికి బయట పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంత గొప్పనేతను అగౌరపరిచేలా చేసిన కార్పొరేటర్ మతీన్‌కు బుద్దిచెప్పారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.