నరేంద్ర మోడీ వంటి ప్రధానమంత్రిని చూడలేదంటున్న అధికారులు... ఎందుకు?
నరేంద్ర మోడీ వంటి ప్రధానమంత్రిని స్వతంత్ర భారతావనిలో ఇంతకుముందెన్నడూ చూడలేదని పలువురు ఐపీఎస్ అధికారులు అంటున్నారు. ఇంతకీ వారు అలా వ్యాఖ్యానించడానికిగల కారణాలను తెలుసుకుందాం.
నరేంద్ర మోడీ వంటి ప్రధానమంత్రిని స్వతంత్ర భారతావనిలో ఇంతకుముందెన్నడూ చూడలేదని పలువురు ఐపీఎస్ అధికారులు అంటున్నారు. ఇంతకీ వారు అలా వ్యాఖ్యానించడానికిగల కారణాలను తెలుసుకుందాం.
ఇటీవల భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. ఆయన అంతిమ యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.
వాజ్‌పేయి అంతిమ యాత్రలో, ఆయనకు తుదిసారిగా వీడ్కోలు చెబుతూ, దాదాపు ఆరుకిలోమీటర్ల దూరాన్ని ప్రొటోకాల్‌ను, భద్రతా అంశాలనూ పక్కనబెట్టి మరీ ప్రధాని నరేంద్ర మోడీ నడిచారు. ప్రధాని వైఖరికి సీనియర్ అధికారులు ఫిదా అయ్యారు.
కళ్లల్లో పెల్లుబుకుతున్న నీటిని దిగమింగుకుంటూ, భాజపా ప్రధాన కార్యాలయ భవనం మొదలుకొని యమునా నది ఒడ్డున ఉన్న స్మృతిస్థల్ వరకు సాధారణ పౌరుడిలా వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఉంచిన వాహనం పక్కనే మోడీ నడవటాన్ని చూసి ఆయనకు నిత్యమూ భద్రత కల్పించే సిబ్బంది నివ్వెరపోయారు. ఉద్వేగభరింతంగా సాగిన ఆయన నడక పదవీ విరమణ చేసిన అధికారుల మనసులనూ కొల్లగొట్టింది.
ఇది అపూర్వ ఘటనని, ఇంతకుముందు దేశంలో ఎక్కడా, ఎన్నడూ ఇలా జరగలేదని, తన సర్వీసులో ప్రధాని ఇంత దూరం నడక సాగించడం ఇదే తొలిసారని ఆయన భద్రతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. యాత్ర పొడవునా పహారా కాశామని, మోడీ నడకను చూసి ఎంత ఆశ్చర్యపోయామో తమకే తెలుసునని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ అన్నారు.