Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అటల్ బిహారీ వాజ్‌పేయిపై విమర్శలు : ప్రొఫెసర్‌పై హత్యాయత్నం

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి‌పై పోస్ట్ చేసిన ప్రొఫెసర్‌పై కొందరు హత్యాయత్నం చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. అటల్‌జీకి నివాళులర్పించేందుకు వెళ్లిన స్వామి అగ్రివేశ్‌పై బీజేపీ అభిమానుల

Advertiesment
అటల్ బిహారీ వాజ్‌పేయిపై విమర్శలు : ప్రొఫెసర్‌పై హత్యాయత్నం
, ఆదివారం, 19 ఆగస్టు 2018 (17:35 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి‌పై పోస్ట్ చేసిన ప్రొఫెసర్‌పై కొందరు హత్యాయత్నం చేశారు. ఈ ఘటన కలకలం రేపింది. అటల్‌జీకి నివాళులర్పించేందుకు వెళ్లిన స్వామి అగ్రివేశ్‌పై  బీజేపీ అభిమానులు దాడిచేసిన వైనాన్ని ఇంకా మర్చిపోకముందే  బిహార్‌కు చెందిన  ప్రొఫసర్‌ను దారుణంగా కొట్టి హత్యాయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. బిహార్‌లోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వాజ్‌పేయిని ఫేస్‌బుక్‌లో విమర్శిస్తూ పోస్టు పెట్టినందుకు మోతీహరిలోని యూనివర్శిటీలో పనిచేస్తున్న సోషియాలజీ  అసిస్టెంట్ ప్రొఫెసర్ సంజయ్ కుమార్‌పై దాడికి దిగారు. మూడో అంతస్తులోని ఆయన నివాసం నుంచి రోడ్డుమీదకు ఈడ్చుకు ఇచ్చారు. దాదాపు 12 మంది గూండాలు కత్తులు, కటార్లతో ఇంట్లో ఉన్న ప్రొఫెసర్‌ను బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదారు. 
 
అంతటితో ఆగకుండా ప్రొఫెసర్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించేందుకు యత్నించారు. అయితే, పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన ప్రొఫెసర్‌ స్థానిక అసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగావుండటంతో పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతి సాయం వెనుక గొప్ప త్యాగం.. చేపలు అమ్మగా వచ్చిన డబ్బును కేరళ వరద బాధితులకు...