Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అటల్ జీ డ్రీమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ సినిమాను 25 సార్లు చూశారట..

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి కవిత్వమంటే ప్రాణం. సాహిత్యంతో పాటు సినిమాలంటే చాలా ఇష్టం. అటల్ జీ డ్రీమ్ గర్ల్ బాలీవుడ్ హీరోయిన్ హేమమాలిని. బాలీవుడ్ నటి హేమ మాలినికి ఆయన గొప్ప ఫ్యాన్. హేమమా

అటల్ జీ డ్రీమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ సినిమాను 25 సార్లు చూశారట..
, శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:52 IST)
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి కవిత్వమంటే ప్రాణం. సాహిత్యంతో పాటు సినిమాలంటే చాలా ఇష్టం. అటల్ జీ డ్రీమ్ గర్ల్ బాలీవుడ్ హీరోయిన్ హేమమాలిని. బాలీవుడ్ నటి హేమ మాలినికి ఆయన గొప్ప ఫ్యాన్. హేమమాలిని నటించిన ''సీత ఔర్ గీత'' సినిమాను వాజ్‌పేయి ఏకంగా 25 సార్లు చూశారట. ఓసారి హేమ మాలిని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మొదటిసారి వాజ్‌పేయిని కలిసినప్పుడు, ఆయన తనతో మాట్లాడేందుకు కొంత ఇబ్బంది పడ్డారని తెలిపారు. 
 
వాజ్‌పేయి తనకు వీరాభిమాని అని ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయానని హేమ మాలిని ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయి కవితలు ఆయనకు వేలాది మంది అభిమానును తెచ్చిపెట్టాయి. కొన్ని కవితలను బాలీవుడ్ దిగ్గజాలు పాడి, అందరూ ఆస్వాదించేలా చేశారు. సుప్రసిద్ధ గాయనీమణి లతా మంగేష్కర్, గాయకుడు జగ్జీత్ సింగ్ వాజ్‌పేయి కవితలను ఆలపించారు.
 
ఇక దేశాభివృద్ధిలో అటల్ బీహారీ వాజ్ పేయి పాత్ర కీలకం. వాజ్‌పేయి హయాంలో మారుమూల గ్రామాలకు సైతం రహదారి సదుపాయం కల్పించారు. బావి తరాల కోసం సుమారు 20ఏళ్ల క్రితమే తన కలల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ముందు చూపుతో అప్పట్లోనే జాతీయ రహదారులకు జీవం పోసిన మహానేత వాజ్ పేయి. ఆయన కల సాకారం అయ్యింది. ప్రస్తుతం ఎటుచూసినా నాలుగు రోడ్ల విశాల జాతీయ రహదారులు, మారుమూల గ్రామాలకు సైతం రహదారి సదుపాయం ఉన్నాయంటే అది వాజ్ పేయి కృషి ఫలితమే.
 
5వేల 846 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి నేషనల్ హైవే డెవలెప్ మెంట్ ప్రాజెక్టు పేరుతో నాటి ప్రధాని వాజ్‌పేయీ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా రహదారులు లేని మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మరో పథకమే ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన. 2000లో ఈ పథకానికి వాజ్‌పేయీ శ్రీకారం చుట్టారు. 
 
ఈ రెండు కలల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి పెట్రోల్‌, డీజిల్‌పై వాజ్‌పేయీ ప్రభుత్వం సెస్సు విధించింది. దీనిపై విపక్షాలు భగ్గుమున్నాయి. ప్రజలపై భారం మోపుతున్నారని నిందించాయి. అయినా, ఏమాత్రం లెక్కచేయకుండా విపక్షాల విమర్శలను పక్కనపెట్టి.. ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా వాజ్‌పేయీ ముందుకెళ్లారు. 
 
చివరికి ఇప్పుడున్న రహదారులు కూడా ఆయన చలవేనని స్వయానా సుప్రీం కోర్టు ముందు యూపీఏ సర్కారు అంగీకరించాల్సి వచ్చింది. గత 32 ఏళ్లలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వరకు వాజ్‌పేయీ హాయంలో రూపుదిద్దుకున్నవే. అందుకే దేశాభివృద్ధికి వాజ్‌పేయి బాటసారి అంటూ రాజకీయ విశ్లేషకులు కితాబిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్: సునయనతో కన్నీళ్ళు పెట్టించిన కాల్ సెంటర్ టాస్క్..?