Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిప్రకాష్‌ కేసులో శివాజీ అప్రూవర్‌గా మారడానికి సిద్ధమయ్యాడా?

Webdunia
మంగళవారం, 14 మే 2019 (21:50 IST)
టివి9 ఛానల్ సిఈఓ రవిప్రకాష్‌ వ్యవహారం ఏ స్థాయిలో చర్చకు దారితీసిందో చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను నెంబర్ 1 ఛానల్‌గా ఎదిగిన టివి9కు వ్యవస్థాపకుడే రవిప్రకాష్. అలాంటి ఛానల్ నడుపుతున్న రవిప్రకాష్‌ మెరుగైన సమాజం కోసం తన ప్రయత్నమంటూ రకరకాల మాటలు చెప్పుకొచ్చాడు. అయితే ఉన్నట్లుండి రవిప్రకాష్‌‌కు బాడ్ టైం స్టార్టయ్యింది.
 
అందుకు ప్రధాన కారణం ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలను రవిప్రకాష్‌ నొక్కేశారన్న ఆరోపణలే. ఇది కాస్త ఆ సంస్థలోని డైరెక్టర్లకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో రవిప్రకాష్‌‌ను సిఈఓ పదవి నుంచి తొలగించి కొత్త సిఈఓ, కొత్త సిఓఓలను నియమించారు. దీంతో రవిప్రకాష్ కేవలం డైరెక్టర్లలో ఒకరిగా మాత్రమే మిగిలిపోయారు. అందులోను 10 శాతం షేర్స్ మాత్రమే రవిప్రకాష్‌కు టివి9లో ఉంది. దీంతో ఛానల్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రవిప్రకాష్‌ పెద్దగా తలదూర్చే అవకాశం లేదు.
 
ఇదంతా జరుగుతుండగా ఇందులో మరో కీలక పాత్రధారి కూడా ఉన్నారు. ఆయనే నటుడు శివాజీ. రవిప్రకాష్‌ ఫోర్జరీకి శివాజీ సహకరించారన్న ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. ఈ నేపధ్యంలో శివాజీ అఫ్రూవర్‌గా మారిపోవడానికి సిద్థమైనట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments