Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన్మథ సినిమాను తలపిస్తున్న హాజీపూర్ ఘటనలు...

Advertiesment
మన్మథ సినిమాను తలపిస్తున్న హాజీపూర్ ఘటనలు...
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:56 IST)
వీడో సీరియల్ కిల్లర్. నాలుగు రోజుల వ్యవధిలో ఒకే బావిలో రెండు మృతదేహాలు లభ్యం కావడంతో  యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శ్రావణి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో మరో అదృశ్యం కేసు తెర పైకి వచ్చింది. 
 
నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలిక తుంగని కల్పన కనిపించకుండా పోవడం వెనుక ఇతని హస్తం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే మండలంలోని మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పన హాజీపూర్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ అదృశ్యమైంది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు చేసినా కేసు కొలిక్కి రాలేదు. 
 
మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా పురోగతి లేకపోవడంతో కేసు మూసేశారు. బొమ్మల రామారం మండలంలో నేరాల్ని నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంతో ఎస్సై వెంకటేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రావణి , మనీష కేసులో  జరిగిన ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే... స్కూల్ , కాలేజీకి వెళ్లి తిరిగి గ్రామానికి వచ్చే యువతులను టార్గెట్ చేసకుంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి.
 
గ్రామానికి బస్సు సౌకర్యం తక్కువుగా ఉండటంతో బొమ్మలరామారం నుండి హాజీపూర్ గ్రామానికి వెళ్లే గ్రామస్తులు , ఎవరైనా వారి గ్రామం వారు కనిపిస్తే బైక్ లపై ఎక్కించుకుని వెళ్లడం అందరికి అలవాటుగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు ఈ ఇద్దరికీ లిఫ్టు ఇచ్చి తనపై నమ్మకం కలిగేలా చేసుకున్నాడు. కావాలని వీరు తిరిగి గ్రామానికి వచ్చే వరకూ ఏదో పని ఉన్నట్టు వీరి ముందు నుండి వెళ్లి లిఫ్టు ఇచ్చేవాడు. 
 
శివరాత్రి మరుసటి రోజు మనీషను లిఫ్టు పేరుతో తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చాడు. తన బావిలోనే పాతిపెట్టాడు. మనీష తండ్రికి నలుగురు కుమార్తెలు, పెద్ద కూతురు మినహా మిగతా ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మనీష కూడా ఇంట్లో నుండి వెళ్లి ప్రేమ వివాహం చేసుకుందేమో అని పరువు కోసం ఫిర్యాదు చేయలేదు. దీంతో మనీష కేసు బైటకు పొక్కకపోవడంతో... అదే తరహాలో శ్రావణిని టార్గెట్ చేసాడు. 
 
ఆ తరువాత శ్రావణిని హత్య చేసి గ్రామంలోని యువకులతో క్రికెట్ ఆడి మరుసటి రోజు పెళ్లికి కూడా హాజరయ్యాడు. శ్రావణిని బైక్ పైన ఎక్కించుకునే దృశ్యాలు సీసీ కెమేరాకు చిక్కడంతో అడ్డంగా దొరికిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదు.. విడాకులిప్పించాలన్న భార్య