Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త ముందే భార్యపై సామూహిక అత్యాచారం.. భర్తను కొడుతూ భార్యపై రేప్

Advertiesment
భర్త ముందే భార్యపై సామూహిక అత్యాచారం.. భర్తను కొడుతూ భార్యపై రేప్
, బుధవారం, 8 మే 2019 (11:05 IST)
మహిళలకు దేశంలో భద్రత కరువైంది. తాజాగా రాజస్థాన్‌లో కామాంధులు రెచ్చిపోయారు. భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ ఆళ్వార్‌లోని లాల్ వాడీ గ్రామం నుంచి త్రల్విక్షా గ్రామానికి ఓ జంట బైక్‌పై బయలుదేరింది. అయితే వీరిని రెండు మోటార్ సైకిళ్లలో కొందరు దుండగులు వెంబడించారు.  
 
నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వీరి బైక్‌ను అడ్డగించారు. అనంతరం భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఓ వైపు భర్త దాడి చేస్తూనే.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని వీడియోలో చిత్రీకరించిన దుండగులు, విషయం బయటకు చెబితే చంపేస్తామనీ, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని హెచ్చరించారు. 
 
అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ శరీరం మొత్తం ప్రజల రక్తంతో తడిసిపోయింది : మమతా బెనర్జీ