Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెడబెట్టి ఈడ్చుకెళ్లి నా ముందే దుస్తులిప్పి రేప్ చేశారు..

Advertiesment
మెడబెట్టి ఈడ్చుకెళ్లి నా ముందే దుస్తులిప్పి రేప్ చేశారు..
, బుధవారం, 8 మే 2019 (10:43 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అళ్వార్‌లో జరిగిన అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చారు. అత్యాచారానికి ముందు నిందితులు తనను మెడపట్టి ఈడ్చుకెళ్లారని, తమ దుస్తులు చింపివేశారని అళ్వార్ అత్యాచార బాధితురాలు సంచలన విషయం వల్లడించింది. ఆ యువతి వెల్లడించిన అన్ని అంశాలను పోలీసులు ఎఫ్.ఐ.ఆర్‌లో పొందుపరిచారు. 
 
రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు యువకులు బాధితుల బైక్‌ను అడ్డగించారు. అనంతరం యువకుడిపై దాడి చేసి అతడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 'ఆమెను మెడపట్టి ఈడ్చుకెళ్లారు. వారు నా భార్య దుస్తుల్ని చంపేశారు. అనంతరం అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ గ్యాంగ్‌కి లీడర్‌నని చెప్పుకున్న ఒకడు రెండు సార్లు అత్యాచారం చేశాడు' అని బాధితురాలి భర్త పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చాడు. 
 
రాజస్థాన్‌లోని అళ్వార్ జిల్లా థనగజిలో గత నెల 26వ తేదీన అత్యాచారం జరిగిన విషయం తెల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన విషయాలు ఆలస్యంగా వచ్చాయి. బైక్‌పై వెళ్తున్న ఓ జంటను అడ్డగించిన ఐదుగురు యువకులు..  యువకుడిపై దాడిచేసి అతడి ముందే వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీశారు. విషయం బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి పరారయ్యారు. బాధితులు గత నెల 30న గజి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామెర్లకు చికిత్స చేయమని ఆస్పత్రికి తీసుకెళ్తే శిశువును మాయం చేశారు...