Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్.. ప్రతి నమస్కారం పెట్టలేదనీ...

హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్.. ప్రతి నమస్కారం పెట్టలేదనీ...
, శనివారం, 4 మే 2019 (11:34 IST)
హైదరాబాద్ నగరంలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ మొదలైంది. అందులో ఒక గ్యాంగ్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు కావడం గమనార్హం. ఈ గ్యాంగ్‌లోని సభ్యుల్లో కొందరికి ప్రత్యర్థి గ్యాంగ్‌లోని సభ్యులు ప్రతి నమస్కారం పెట్టలేదన్న అక్కసుతో దాడి చేశారు. 
 
ఈ గ్యాంగ్ వార్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని రెహమత్‌నగర్‌లో స్థానిక గల్లీ నేత అనుచరగణం రెచ్చిపోయింది. అర్థరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఉమాకాంత్ అనే యువకుడు సమస్తే పెట్టకపోవడంతో ఊగిపోయిన స్థానిక టీఆర్ఎస్ లీడర్ అరుణ్... ఉమాకాంత్‌ను తీవ్రంగా మందలించాడు. 
 
ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఉమాకాంత్‌కు చెందిన బైక్‌ను టీఆర్ఎస్ లోకల్ లీడర్ అరుణ్, అతడి అనుచరులు తగులబెట్టారు. బైక్ తగలబెట్టి బెదిరింపులకు పాల్పడిన స్థానిక టీఆర్ఎస్‌ నేత అరుణ్‌పై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఉమాకాంత్‌ను పోలీసుల సమక్షంలోనే అరుణ్ అనుచరులు బెదిరించారు. దీంతో అరుణ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
 
కాగా, నమస్తే పెట్టకపోవడం, మర్యాద ఇవ్వకపోవడంతోనే నాపై అరుణ్ కక్ష్య కట్టాడని ఉమాశంకర్ అంటున్నాడు. అందులో భాగంగానే రాత్రి ఇంటి వద్ద నన్ను చంపేందుకు అరుణ్, అతని అనుచరులు యత్నించారని.. తనపై పెట్రోల్ పోయడంతో తప్పించుకునేందుకు పారిపోయానని... దీంతో, నా బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారని వెల్లడించారు. నాకు ప్రాణహాణి ఉంది.. మాది పేద కుటుంబం... నాకు న్యాయం చేయాలని ఉమాశంకర్ ప్రాధేయపడుతున్నాడు. అయితే, పోలీసులు మాత్రం మిన్నకుండిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈతకొలనులో జలకాలాడుతున్న గంటా.. మనవడితో నీలిరంగు ఆటలు