Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రలో ఉన్న యువతిపై ఆస్ట్రేలియా యువ క్రికెటర్ అత్యాచారం

Advertiesment
నిద్రలో ఉన్న యువతిపై ఆస్ట్రేలియా యువ క్రికెటర్ అత్యాచారం
, బుధవారం, 1 మే 2019 (15:44 IST)
మంచి నిద్రలో ఉన్న యువతిపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువ క్రికెటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కూడా సహచరుడి ప్రియురాలు కావడం గమనార్హం. ఈ నేరానికి పాల్పడిన ఆ యువ క్రికెటర్‌కు ఇంగ్లండ్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 
 
ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు... ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్‌ హెప్‌బర్న్‌(23) 2017లో ఇంగ్లండ్‌లోని వార్చెస్టెర్‌షేర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరపున ఆడుతున్నాడు. ఓ రోజు తన సహచర ఆటగాడు జో క్లార్క్‌ ఓ అమ్మాయిని తన గదికి తీసుకువచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో అలెక్స్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు విచారణ హెర్ఫోర్డ్‌ క్రౌన్‌ కోర్టులో రెండేళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ విచారణ సమయంలో "నేను నిద్రపోతుండగా అలెక్స్‌ తనపై అత్యాచారం చేశాడని, తొలుత తాను తన ప్రియుడు జో క్లార్క్‌ అనుకున్నానని, గొంతు గుర్తుపట్టిన తర్వాతే అది అలెక్స్‌" అని అర్థమయిందని కోర్టులో చెప్పింది. 
 
అయితే, అలెక్స్ మాత్రం తన వాదనను మరోలా వినిపించాడు. ఆమె తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందని చెప్పాడు. వారిద్దరి వాదనలు ఆలకించిన కోర్టు అలెక్స్‌ తప్పుడు వాదన చేస్తున్నాడని నిర్థారించి ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యబాబోయ్.. నేను "గే"ను కాదు : జేమ్స్ ఫాల్కనర్