Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తస్మాత్ జాగ్రత్త... ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకే?

తస్మాత్ జాగ్రత్త... ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకే?
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (11:04 IST)
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల నిబంధన ఒకటి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈవీఎంల ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు లేదా రూ.వెయ్యి అపరాధం చెల్లించాలన్నది ఆ నిబంధనగా ఉంది. ఈ నిబంధనను ఇపుడు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీన్ని రద్దు చేయాలంటూ సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
సాధారణంగా ఎన్నికల పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఇందులో ఉండే ఒక బటన్ నొక్కితే వీవీప్యాట్‌లో మరో గుర్తుకనబడిందని అనేక మంది ఆరోపిస్తున్నారు. 
 
అయితే, ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదు. ఓటరు ఏ గుర్తుపై అయితే బటన్ నొక్కుతాడో వీవీప్యాట్‌లో కూడా అదే గుర్తుపడిందని చెప్పాల్సిందే. మరో గుర్తుకు పడిందని చెబితే మాత్రం ఆరు నెలలు జైలుశిక్ష లేదా రూ.1000 వెయ్యి అపరాధం చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఇదే కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధన. ఈ నిబంధనపై సునీల్ ఆహ్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన్మథ సినిమాను తలపిస్తున్న హాజీపూర్ ఘటనలు...