'సాహో' చాప్టర్ 2 (టీజర్) రిలీజ్ డేట్ ఫిక్స్..!

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (14:13 IST)
ప్రభాస్ నటనకు ఎలాంటి వారైనా పడిపోతారు. ఇటీవలే ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ చిత్రంలో ప్రతీ ఒక్కరి పాత్ర చాలా ముఖ్యమైంది. ఇక ప్రభాస్ గురించి చెప్పాలంటే.. ప్రభాస్ ఏ పాత్రలో ఉన్నా దానికి తగినట్టుగానే స్పష్టంగా నటిస్తారు. అది ఏ సినిమానైనా ఫర్వాలేదు. ఇలాంటి ప్రభాస్ ఇప్పుడు ప్రస్తుతం 'సాహో' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. 
 
అసలు విషయం ఏటంటే.. సాహో చిత్రాన్ని బాహుబలి స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రభాస్‌కి జోడిగా నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి మరో అప్ డేట్ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు.
 
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తొలి టీజర్‌ను షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 పేరుతో విడుదల చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా అంటే  మార్చి 3వ తేదీన చాప్టర్ 2ను విడుదుల చేయనున్నట్టుగా ప్రకటించారు. అలానే రిలీజ్ సమయాన్ని కూడా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షేడ్స్ ఆఫ్ 'సాహో' చాప్టర్ 2ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments