రాజమౌళి అసిస్టెంట్, కేజీఎఫ్ డైరక్టర్‌తో ప్రభాస్ సినిమా

మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:36 IST)
ప్రముఖ దర్శకుడు, బాహుబలి మేకర్ రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా వున్నాడు. అలాగే బాహుబలి హీరో ప్రభాస్ కూడా ''సాహో'' చిత్రం షూటింగ్‌లో వున్నాడు. ఇంకా ప్రభాస్ చేతిలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జాన్ అనే సినిమాను టైటిల్ ఖరారు చేసేలా వున్నారు.
 
అంతేగాకుండా.. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణ అనే యువకుడు, ఇటీవల ప్రభాస్ కి ఒక కథ చెప్పాడట. ఆ కథ ఆయనకి నచ్చడంతో, యూవీ క్రియేషన్స్ లో నిర్మించాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. యువ దర్శకులు డైరక్ట్ చేసే సినిమాల్లో నటించేందుకు ప్రభాస్ ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ ప్రభాస్‌కి తెగ నచ్చేసిందట. 
 
యూవీ క్రియేషన్స్‌లో నిర్మించాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అంతేగాకుండా.. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గర్భందాల్చిన ప్రియాంకా... తల్లి ఏమన్నదో తెలుసా?