Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క సాంగ్‌కే అలాంటి రెస్పాన్స్‌.. ఆశ్చర్యంతో రాయ్ లక్ష్మీ..

Advertiesment
Rai Laxmi
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (12:46 IST)
కాంచన చిత్రంలో రాయ్ లక్ష్మీకి హీరోయిన్‌గా నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే లక్ష్మీకి ఈ సినిమా అంత గుర్తింపు దొరకలేదని చాలా బాధపడ్డారు. అలాంటి రాయ్ లక్ష్మీకి ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. లక్ష్మీ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో జూలీ 2 షూటింగ్ సమయంలో చిరంజీవి కాంబినేషన్‌లో రత్తాలు సాంగ్‌లో నటిస్తారా అని అడిగారు. వెంటన అంగీకరించాను. ఆ పాటకు ఇంత మంచి స్పందన వస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు. ఒక్క సాంగ్‌కే నేను అలాంటి రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చారు.
 
చిరంజీవిగారి 150 ఫిల్మ్‌లో ఒక స్పెషన్ సాంగ్ చెయ్యడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. బాలీవుడ్‌లో ఇలాంటి సాంగ్స్ చేస్తే స్పెషల్ సాంగ్స్ అంటారు. అదే టాలీవుడ్‌లో చేస్తే ఐటమ్ సాంగ్ అంటారు. అలా ఎందుకంటారో నాకు అర్థం కావడంలేదని రాయ్ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఏది ఏమైనా మన మైండ్ సెట్ ‌బట్టే ఉంటుంది. కాబట్టి ప్రత్యేక సాంగ్ చేసినా సంతృప్తికరమైన పారితోషికం దక్కుతుందని లక్ష్మీ అన్నారు. 
 
ప్రస్తుతం రాయ్ లక్ష్మీ కిషోర్ కూమార్ దర్శకత్వంలో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల కానుంది. దీని సందర్భంగా రాయ్ లక్ష్మీ విలేకరులతో మాట్లాడుతూ.. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రానికి అర్థమేమిటని చాలామంది అడుగుతున్నారు. ఈ చిత్రాన్ని చూశాకే.. ఆ పేరుకి సినిమాకి ఉన్న కనెక్షన్ అర్థమవుతుందని చెప్పారు. ఈ సినిమా పేరు ఇంగ్లిష్ టైటిల్ అయినా కథ మాత్రం తెలుగే. ఇది చిత్రం ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఇందులో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.
 
ఇక ఈ సినిమాలో నా పేరు వెంటకలక్ష్మి. నేను ఓ స్కూల్ టీచర్‌ని. అసలు ఈ చిత్రంలో వెంటకలక్ష్మి ఎవరు.. తన జీవితంలో తనకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనే విషయాలపై ఈ కథ సాగుతుంది. నేను మొదటిసారి ఈ కథ విన్నప్పుడే చాలా నచ్చింది. ఇందులో కామెడీతో పాటు సస్పెన్స్ కూడా చాలా బాగుంది. నేను బాలీవుడ్‌లో అకీరా, జూలీ 2 సినిమాల్లో నటించిన తరువాతే కొన్ని అవకాశాలు వచ్చాయి.
 
అయితే ఇంతవరకూ నేను ఏది అంగీకరించేలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ మన సౌత్ ఇండస్ట్రీ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక కిషోర్ గురించి చెప్పాలంటే.. సెట్‌లో సరదాగా ఉంటారు. చాలా కష్టపడే మనిషి. అలానే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ హరి గోరా వర్క్ కూడా అమేజింగ్.. ఇతను కంపోజ్ చేసిన ప్రతీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నేను తమిళ, కన్నడి సినిమాలు చేస్తున్నాను. ముందు ఈ సినిమాలు పూర్తి అయ్యాక మిగిలిన చిత్రాల గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''లవర్స్ డే'' క్లైమాక్స్ మార్చేశారు.. ఎందుకో తెలుసా?