Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''లవర్స్ డే'' క్లైమాక్స్ మార్చేశారు.. ఎందుకో తెలుసా?

Advertiesment
Lovers Day
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (12:29 IST)
వింక్ బ్యూటీ ప్రియా వారియర్ నటించిన మలయాళ చిత్రం '' ఒరు ఆదార్ లవ్'' తెలుగులో లవర్స్ డే పేరుతో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం  సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రంలోని కన్నుకొట్టే సన్నివేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు.


తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కానీ ఈ సినిమా ఫ్లాఫ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందుకు ఈ సినిమా క్లైమాక్సేనని టాక్ వస్తోంది. దీంతో లవర్స్ డే క్లైమాక్స్‌ను నిర్మాతలు మార్చేశారు. 
 
ఈ సినిమా ఆశించినంత కలెక్షన్లు రాకపోవడంతో పాటు చిత్రంలోని క్లైమాక్స్‌ ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందని కామెంట్లు రావడంతో, 10 నిమిషాల కొత్త క్లైమాక్స్‌ను చిత్రీకరించామని, బుధవారం నుంచి ప్రేక్షకులు కొత్త క్లైమాక్స్‌ను చూడవచ్చని దర్శకుడు ఒమర్ చెప్పారు.

రియలిస్టిక్‌గా సినిమాను చూపించాలన్న ఉద్దేశంతోనే క్లైమాక్స్‌లో ట్రాజెడీని చూపించామని, అయితే, ప్రేక్షకులు నిరాశ చెందడంతో, నిర్మాతలతో చర్చించి ముగింపును మార్చామన్నారు. బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్ సన్నివేశంతో సినిమా ప్రదర్శిస్తామని దర్శకుడు ఒమర్‌ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేక్షకులే భక్తులు.. నేను బస్సును నడిపే డ్రైవర్‌ను : కళాతపస్వి (టీజర్)