Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న వ‌కీల్‌సాబ్ ద‌ర్శ‌కుడు!‌

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (18:29 IST)
Venu Sriram
ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో `వ‌కీల్‌సాబ్‌` సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వేణుశ్రీ‌రామ్ సినిమా విడుద‌ల త‌ర్వాత చాలా ఉద్వేగానికి లోన‌య్యారు. అభిమానిగా ప‌వ‌న్ వ్య‌క్తిత్త్వం నాకు తెలుసు. అందుకే ఇందులో రాసిన డైలాగ్స్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని అంటున్నాడు. శుక్ర‌వార‌మే విడుద‌లై మంచిటాక్‌తో ర‌న్ అవుతున్న ఈ సినిమా విజ‌యం గురించి ఆయ‌న స్పందించారు. 
 
.ఓవర్సీస్ తో పాటు అన్ని ఏరియాల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు ఇలా..అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. అన్నారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పేలని అనుభూతినిచ్చింది. 
 
Dir. Sanmanam
లైఫ్ లాంగ్ ఈ మూవ్ మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను. పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను.  సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోసం పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్ గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్ అంటూ, ఒక్క‌సారిగా .దర్శకుడు శ్రీరామ్ వేణు ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
దర్శకుడు శ్రీరామ్ ‌వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ చిత్ర బృందం వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments