Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి : రైటర్ పద్మభూషణ్‌ హీరో, దర్శకుడు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (18:56 IST)
suhas, prasanth and team
సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రిమియర్స్ కు ప్రేక్షకుల నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో  చిత్ర యూనిట్  ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
 
సుహాస్ మాట్లాడుతూ..  ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ప్రిమియర్స్ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను దీవిస్తుంటే అనందంతో నాకు మాట రాలేదు. ఓ దశలో ఏడుపు వచ్చింది.  మా సినిమాతో పాటు వస్తున్న అన్ని సినిమాలు విజయాలు సాధించాలి’’ అన్నారు.
 
శరత్ మాట్లాడుతూ..   ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని పేరు పెట్టాం. సినిమా విడుదల వుంది. కానీ మాకు ఒత్తిడి లేదు. మేము సక్సెస్ కొట్టేసినట్లు ఫీలౌతున్నాం. గత ఆరు రోజులు గా..  విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్  కి టీం అంతా వెళ్లి అక్కడ కొందరితో కలిసి వాళ్ళన్ని థియేటర్ లోకి తెచ్చాం.  ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి థియేటర్లో అందరూ గట్టిగా నవ్వడం మర్చిపోలేని అనుభూతి. చాలా అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.  ఒక పెద్ద స్టార్ కి వుండే రెస్పాన్స్ మా మొదటి సినిమాకి వుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  వర్డ్ అఫ్ మౌత్ ని నమ్ముకొని వెళ్తున్నాం. మీకు సినిమా నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించాం. మల్టీ ప్లెక్స్ లో 150( జీఎస్టీతో కలుపుకొని). తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక , యుఎస్ , కెనడా, ఆస్ట్రేలియా లో విడుదలౌతుంది. మా సినిమాతో పాటు వస్తున్న సందీప్ కిషన్ గారి మైఖేల్, నాగ వంశీ గారి సినిమా.. అన్నీ సినిమాలు మంచి విజయాలు సాధించాలి. ’’ అని కోరారు
 
షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్  ప్రిమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ  స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని నమ్మకంగా పేరు పెట్టాం . మా నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రేక్షకులు రియాక్షన్ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. మా అమ్మగారు ఫోన్ చేసి  నీ సినిమాని మన బంధువులు చూశారట. అప్పడు తిట్టినవాళ్ళే ఇప్పడు పొగుడుతున్నారు అనేసరికి ఏడిచేసాను అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments