Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాత్రని అడగడానికి మొహమాటం వుండదు : ఆశిష్ విద్యార్థి

Ashish Vidyarthi
శనివారం, 21 జనవరి 2023 (17:06 IST)
Ashish Vidyarthi
నాకు  డ్రీం రోల్ అంటూ ప్రత్యేకంగా ఏమీ వుండదు. తర్వాత చేయబోయే పాత్రే డ్రీమ్ రోల్ గా భావిస్తాను. సినిమా అనేది దర్శకుడు, రచయిత కి సంబధించినది. నిర్మాత ఆ కలని నిజం చేస్తాడు. దీనికి నటులు తోడౌతాడు. మంచి పాత్ర రావాలంటే అది దర్శకుడు, రచయితపైనే ఆధారపడి వుంటుంది. నా వరకూ అన్ని రకాల పాత్రలు చేయాలనీ వుంది. మొదట్లో చాలా వరకూ విలన్ రోల్స్ చేశాను. ఇప్పుడు నేను కోరుకునే పాత్రలు, సెంట్రల్ రోల్స్ చేయాలని వుంది. దర్శక రచయితలకు ఓ మంచి పాత్రని అడగడానికి నాకు మొహమాటం వుండదు. ఐతే వాళ్ళు మంచి పాత్రని ఇవ్వాలన్నా అది మనం చేయగలమని నమ్మకం కల్పించడం కూడా మన బాధ్యతే అని ఆశిష్ విద్యార్థి అన్నారు.   
 
సుహాస్ హీరోగా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్  నిర్మించిన ఈ చిత్రాన్ని  జి. మనోహర్ సమర్పిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
రైటర్ పద్మభూషణ్‌ జర్నీ ఎలా ఉంది?
మనం ఎక్కడో దూరంగా ఆలోచించి మన దగ్గరే వుండే సింపుల్ గా వుండే విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఛాయ్ బిస్కెట్ ప్రయాణం కూడా ఇలా సింపుల్ గా గానే మొదలైయింది. ఈ సినిమాలో పనిచేసిన వారంతా ముందు యుట్యూబ్ లో వీడియోలు చేశారు. అక్కడే నేర్చుకున్నారు. అవకాశాలు ఇచ్చి, నేర్పించేవారు వారంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో పని చేయడం చాలా గర్వంగా వుంది. మంచి హ్యుమర్ వున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఫిబ్రవరి3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
 
రైటర్ పద్మభూషణ్‌ లో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
ఒక మధ్యతరగతి తండ్రిగా కనిపిస్తా. ప్రతి తండ్రిలానే తన కొడుకు ఎదో సాధిస్తాడనే ఆశ పడే తండ్రి పాత్ర. తనకి ఒక ఫిక్స్ లైఫ్ స్టయిల్ వుంటుంది. ప్రతి రూపాయిని లెక్కపెట్టుకునే తండ్రి. అయితే తన జీవితంలో ఎదో డిఫరెంట్ గా జరుగుతుంది. చివర్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ వుంటుంది. సినిమా చూసిన వారు రివ్యూ ఇవ్వండి కానీ దయచేసి ఆ ట్విస్ట్ ని మాత్రం రివిల్ చేయొద్దు. చాలా మంచి హ్యుమర్, ఎమోషన్ వుంటుంది. చాలా నిజాయితీగా తీసిన చిత్రమిది.
 
మీ కెరీర్ లో చాలా పెద్ద స్టార్స్ తో సినిమాలు చేశారు కదా.. ఇప్పుడు కొత్తవాళ్ళతో చేయడం ఎలా అనిపించింది ?
నేను ఎప్పుడూ పెద్ద సినిమా,  చిన్న సినిమ అని చూడను. వచ్చిన పాత్రని, నచ్చిన పాత్రని చేసుకుంటూ వెళ్ళడమే తెలుసు. నా వరకూ తోటి నటులతో యాక్ట్ చేస్తున్నపుడు నా పాత్రని ఎంత వరకూ న్యాయం చేస్తున్నాననె దానిపైనే ద్రుష్టి వుంటుంది తప్పితే చిన్నా పెద్ద ఆలోచన వుండదు.
 
సుహాస్ లో మీరు పరిశీలించిన విషయాలు ?
సుహాస్ చాలా సింపుల్. చాలా సహజంగా ఉంటాడు. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. నాని, సుహాస్ లో చాలా సిమిలారిటీస్ కనిపించాయి.
 
మీరు చాలా వరకూ సీరియస్ రోల్స్ చేశారు. ఈ సినిమాలో రోహిణి కాంబినేషన్ లో కామెడీ సీన్స్ చేయడం ఎలా అనిపించింది ?
నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇందులో పాత్రలన్నీ చాలా అందంగా వుంటాయి. అందుకే ప్రేక్షకులకు చూపించాలని చాలా ఎక్సయిటెడ్ గా వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎప్పుడూ గెలిచేది మంచి కథే : దిల్ రాజు