Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిబ్రవరి 3న 'రైటర్ పద్మభూషణ్' రిలీజ్

writer padmabhushan
ఆదివారం, 8 జనవరి 2023 (10:00 IST)
టాలీవుడ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకడైన సుహాస్ తన సినిమాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న తన తాజా చిత్రం 'రైటర్ పద్మభూషణ్‌'లో స్ట్రగులింగ్ రైటర్‌గా కనిపించనున్నాడు. తాజాగా 'రైటర్ పద్మభూషణ్' సినిమాని చూసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేసిన 'కాంతారా' చిత్రం ఘనవిజయం అందుకుంది. ఈ చిత్రం ఘన విజయం తర్వాత గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ 'రైటర్ పద్మభూషణ్‌'ని విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 3, 2023న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
 
విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్‌తో కలిసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనోహర్ గోవిందస్వామి సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన చిత్రంలోని ఫస్ట్ సింగిల్ కన్నుల్లో నీ రూపమే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ  అందిస్తున్నారు.  
 
తారాగణం: సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్
నిర్మాతలు: అనురాగ్, శరత్, చంద్రు మనోహర్
సమర్పణ: మనోహర్ గోవింద్ స్వామి
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ : వెంకట్ ఆర్ శాకమూరి
ఎడిటర్: పవన్ కళ్యాణ్ కోదాటి, సిద్ధార్థ్ తాతోలు
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్: కళ్యాణ్ నాయక్
ఆర్ట్: ఎల్లయ్య ఎస్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: సూర్య చౌదరి
పీఆర్వో : వంశీ-శేఖర్
కో-డైరెక్టర్: గోపి అచ్చర
క్రియేటివ్ ప్రొడ్యుసర్స్: ఉదయ్-మనోజ్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక అభిమానికి మా బాస్‌కు తలవంచి నమస్కరిస్తున్నా : నక్కిన త్రినాథ రావు