Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలర్ ఫోటో థియేటర్ లో రాకపోవడం చాలా బాధగా వుంది : సుహాస్

Advertiesment
Suhas, adavi sesh
, శుక్రవారం, 20 జనవరి 2023 (21:31 IST)
Suhas, adavi sesh
సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్‌ ‘తో వస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మాతలు కాగా జి. మనోహరన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. 
 
అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ, ఈ టీం అందరితో నాకు మంచి అనుబంధం వుంది. సుహాస్ టెర్రిఫిక్ యాక్టర్. టీనా, గౌరీ వెరీ ట్యాలెంటెడ్. ఇందులో రోహిణీ గారు నటన చూసి హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఫిబ్రవరి 3న అందరం థియేటర్ లో కలుద్దాం. అనురాగ్, శరత్ అండ్ శేష్.. థాంక్స్ అన్నారు.
 
సుహాస్ మాట్లాడుతూ, శరత్ , అనురాగ్ లేకపోతే నేను లేను. ఇంతమంచి సినిమాని నా దగ్గరకి తీసుకొచ్చిన ప్రశాంత్ కి కృతజ్ఞతలు. మ్యూజిక్ చేసిన శేఖర్ చంద్రకి, బిజియం చేసిన కళ్యాణ్ కి కృతజ్ఞతలు. ఎడిటర్ పీకే కి, డీవోపీ వెంకట్ రమణకి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 3న సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి థియేట్రికల్ రిలీజ్ సినిమా. కలర్ ఫోటో థియేటర్ లో రాకవడం చాలా బాధగా వుంది. ఈ సినిమాతో వస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. సినిమా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా రెండు మూడు గంటలు హ్యాంగోవర్ లో వుంటారు. ఈ ఇక్కడి వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోమాలోకి వెళ్లిపోయిన బిచ్చగాడు హీరో ?