ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త అవతారంతో వైజాగ్‌లో ప్రవేశించాడు. రాజులకాలంనాటి హెయిర్ స్టయిల్‌తో ఇంతవరకు చూడనివిధంగా జుట్టుపెంచి వున్న ఆయన స్టయిల్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గురువారం రాత్రి విశాఖపట్నం తన బ్లాక్ కారులో చేరుకోగానే అభిమానులు భారీ వెల్‌కమ్ చెప్పారు. తాజా సినిమా పుష్ప ది రూల్ కోసం ఆయన ఈ గెటప్‌లో వుంటారు. ఈ సినిమా ఎలా వుంటుందనేది తనకు చాలామంది అడుగుతున్నారు. ఇది అంతకుమించి వుంటుందంటూ అక్కడి యూత్‌ను ఎంకరేజ్ చేస్తూ విష్ చేస్తూ వెళ్ళారు.
కాగా, పుష్ప ది రూల్ జనవరి 21నుంచి ప్రారంభం కానుంది. అల్లు అర్జున్‌తోపాటు జగపతిబాబు కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి, హైదరాబాద్ షెడ్యూల్, ఆ తర్వాత బ్యాంకాక్ చివరి షెడ్యూల్ వుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తిచేయనున్నట్లు కూడా వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.