Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం : సీఎం కేసీఆర్

cmkcr
, బుధవారం, 18 జనవరి 2023 (19:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉక్కు పరిశ్రమను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమన్నారు. విశాఖ ఉక్కును ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేటుపరం చేస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కొనుగోలు చేస్తామని తెలిపారు. 
 
"మేక్ ఇన్ ఇండియా .. జోక్ ఇన్ ఇండియా"గా మారిపోయిందన్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. రానున్న కొద్ది రోజుల్లో బీఆర్ఎస్ విధి విధానాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. 150 మంది మేధావులు తమ పార్టీ విధి విధానాలను రూపొందిస్తున్నారని తెలిపారు. 
 
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? అని నిలదీశారు. ఎల్ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. అలాగే, ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు బీఆర్ఎస్‌ను బలపరచాలని కోరారు. విద్యుత్ సెక్టార్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామన్నారు. దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉందని, అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వం విధానమన్నారు. తెలంగాణాలో అమలవుతున్న దళితబంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

కేసీఆర్ ప్రసంగం హైలైట్స్...
 
* రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ ను ఆవిష్కరిస్తాం.
* దేశమంతా మిషన్ భగీరథతో మంచి నీరు అందిస్తాం.
* ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి దళితబంధు లబ్ది చేకూర్చుతాం.
* మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాం.
* బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్యుత్ ను ప్రభుత్వ అధీనంలోనే ఉంచుతాం.
* తెలంగాణలో ఇస్తున్నట్టు దేశమంతా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అందుకు అవసరమయ్యే ఖర్చు రూ.1.45 లక్షలు.
* మేం అధికారంలోకి వస్తే దేశమంతటా రైతాంగానికి ఉచిత విద్యుత్ అందజేస్తాం.
* దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతు బంధు అమలు చేస్తాం.
* తెలంగాణ మోడల్ ను దేశమంతా తీసుకువస్తాం.
* సైనిక నియామకాల పథకం అగ్నిపథ్ ను రద్దు చేస్తాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూటర్‌పై జంట రొమాన్స్.. మైనర్ అరెస్ట్