Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డికి అనూహ్య మద్దతు... కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసు

క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి అనూహ్య మద్దతు లభించింది. ఆమెకు జాతీయ మానవ హక్కుల సంఘం అండగా నిలించింది. ఆమెను సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం శ్రీరెడ్డి హక్క

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (16:11 IST)
క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి అనూహ్య మద్దతు లభించింది. ఆమెకు జాతీయ మానవ హక్కుల సంఘం అండగా నిలించింది. ఆమెను సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడంగా భావించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది.
 
గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ, పలువురు సినీ ప్రముఖుల పేర్లను ఆమె బహిర్గతం చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఎన్.హెచ్.ఆర్.సి అండగా నిలబడటం గమనార్హం. అంతేకాకుండా, ఇలాంటి సమస్య పరిష్కారం కోసం సరైన యంత్రాంగం లేకపోవడం పెద్ద లోటు అని మానవ హక్కుల సంఘం అంటోంది. 
 
తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై... తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీచేసింది. సినిమాల్లో నటించకుండా ఆంక్షలు విధించడం... శ్రీరెడ్డి హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం