శ్మశానం వెనకాల గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు... కోన వెంకట్‌పై శ్రీరెడ్డి (Video)

గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన ఆరోపణలు చేసింది. ఇపుడు సినీ రచయిత కోన వెంకట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆరోపణలు గుప్పించింది. పైగా, తనతో కోన వెంకట్ అసభ్యంగా ప్ర

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (14:54 IST)
గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన ఆరోపణలు చేసింది. ఇపుడు సినీ రచయిత కోన వెంకట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆరోపణలు గుప్పించింది. పైగా, తనతో కోన వెంకట్ అసభ్యంగా ప్రవర్తించినట్టు నిరూపించే ఆధారాలు ఉన్నాయంటూ ఆమె ప్రకటించారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషంయ తెల్సిందే. ముఖ్యంగా అవకాశాల పేరిట అమ్మాయిలను వాడుకుని వదిలివేస్తున్నారంటూ పలువురు సినీ ప్రముఖుల పేర్లను ఆమె బయటపెట్టింది. ఈ వరుసలో ఇపుడు కోన వెంకట్ కూడా చేరారు. కోన వెంకట్ గురించి ఆమె ఏమన్నదో ఆమె మాటల్లోనే..
 
'కోన వెంకట్‌కు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశానం వెనకాల ఒక గెస్ట్ హౌస్ ఉంది. అప్పుడు రాత్రి 9 అయింది. నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత వి.వి.వినాయక్ కూడా ఇక్కడికే వస్తుంటాడు మేము ఇక్కడే సిట్టింగ్‌లు వేస్తాం. వస్తాడు కాసేపట్లో పరిచయం చేస్తాను అని చెప్పాడు.

ఆడపిల్లలం. మాకు ఆశ ఉండదా? మేము కూడా వర్క్ చేసుకోవాలనే కదా వెళతాం. వాళ్ల చేతుల కింద నలిగిపోయి.. వాళ్లు వేశ్యలకు మల్లే నాలుగు డబ్బులు చేతిలో పెడితే తినాలనుకుంటామా? ఆశ ఉండదా మాకు? వర్క్ ప్లేస్‌లో బోనస్ రావాలని అనుకోమా? ప్రమోషన్ రావాలని అనుకోమా? మీరు చేసేది న్యాయమైతే అర్థరాత్రి.. అపరాత్రి కడుపు కట్టుకుని.. క్యాబ్‌‌లెక్కో.. లేదంటే ఓన్ కార్లు వేసుకునో వెళతాం. ఆశపడటం తప్పైతే ప్రపంచంలో ప్రతివాడూ ఏ ఆశ లేకుండా బతకాలి. సన్యాసుల్లా బతకాలి' అని వ్యాఖ్యానించింది.
 
'కోన వెంకట్ దగ్గరకు వెళ్లాను. తాగుతావా? అంటే నాకు తాగుడు అలవాటు లేదు అన్నాను. నన్ను శారీరకంగా బలవంతం చేశాడు కోన వెంకట్. నేను నిరూపిస్తా. ఇప్పటికీ ఆధారాలున్నాయి. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు అని చాలా మంది మాట్లాడారు.

ఇపుడు ఆధారాలు చూపిస్తే జీర్ణించుకోలేరు. ఆమె ఇష్టమయ్యే వెళ్లింది కదా.. ఆమె నవ్వుతుంది కదా. నా ఆవేదన నా కడుపు ఉడికిపోవడం నాకు తెలుసు. నా కుటుంబానికి తెలుసు. ఎంతమంది చేతుల్లో నలిగిపోవాలి?' అంటూ తన అక్రోశాన్ని వెళ్లగక్కింది శ్రీరెడ్డి. వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

Gold: రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం ఆటోలో మర్చిపోయిన దంపతులు, ఏం జరిగింది?

చీమలంటే భయం చచ్చిపోతున్నా.. పాప జాగ్రత్త.. అన్నవరం, తిరుపతికి 1116, ఎల్లమ్మకు ఒడిబియ్యం

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments