Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డి లీక్స్: దిల్‌రాజు పోతే శని వదిలిపోతుంది.. అతను ఎలా ముద్దెట్టుకున్నాడో?

శ్రీరెడ్డి లీక్స్ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుల రాజకీయాలు వద్దన్నా.. ఆడపిల్లన్నా.. బతకనిద్దామన్నా పాపం.. దిల్ రాజు

Advertiesment
శ్రీరెడ్డి లీక్స్: దిల్‌రాజు పోతే శని వదిలిపోతుంది.. అతను ఎలా ముద్దెట్టుకున్నాడో?
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (10:29 IST)
శ్రీరెడ్డి లీక్స్ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుల రాజకీయాలు వద్దన్నా.. ఆడపిల్లన్నా.. బతకనిద్దామన్నా పాపం.. దిల్ రాజు గారు మీరు పోతే శని వదిలిపోతుంది అనుకుంటారు. ప్లీజ్ సంకెళ్లు వేసిన కళామతల్లిని బంధ విముక్తురాలిని చేయండి. దయచేసి బతికుండగానే మారండి. 
 
వట్టి చేతుల్లో పోతాం. మంచి పేరుతో పోదామన్నా మనమందరం. టాలెంట్‌ను చంపొద్దన్నా.. ఇదే తన విన్నపం అంటూ శ్రీరెడ్డి తెలిపింది. ఇక ''ఆ నిర్మాత తనయుడు, ఇండియన్ ఐడల్ శ్రీరామ్ మీరిద్దరు రాముడు పేరు పెట్టుకొని ఛీ ఛీ'' అంటూ వారిపై కూడా కామెంట్లు చేసింది.
 
అలాగే వరుస లీకులలో టాలీవుడ్‌ను వణికిస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డి తాజాగా ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో ప్రముఖ నిర్మాత కుమారుడు తనను ముద్దాడుతున్న ఫొటోలను లీక్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆ నిర్మాత తనయుడు పేరును ఇప్పటివరకు తాను చెప్పలేదని తెలిపింది. ''అరేయ్ నీకు సిగ్గుందా?'' అని అడుగుతున్నానని ఫైర్ అయింది.
 
స్టూడియోలో ఎలా వాడుకున్నావో తెలుసునని బాంబు పేల్చింది. తనను ఎలా ముద్దాడుతున్నాడో ఫొటోలో చూడాలని... ఇప్పుడు నిర్మాత  కొడుకును బయటకు లాగాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వ్యక్తులను వదల కూడదని డిమాండ్ చేసింది. ఇలాంటి వారికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు పోరాడాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త‌ల్లి అయ్యేందుకు టైమ్ ఉందంటోన్న హీరోయిన్