Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డి లీక్స్: లైంగిక వేధింపులపై పూజా హెగ్డే ఏమంటుందంటే?

శ్రీరెడ్డి లీక్స్‌తో టాలీవుడ్‌‌ను షేక్ చేస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను దుమారం రేపాయి. మా సభ్యత్వం కోసం, కాస్టింగ్ కౌచ్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా

Advertiesment
Pooja Hegde
, గురువారం, 12 ఏప్రియల్ 2018 (13:21 IST)
శ్రీరెడ్డి లీక్స్‌తో టాలీవుడ్‌‌ను షేక్ చేస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను దుమారం రేపాయి. మా సభ్యత్వం కోసం, కాస్టింగ్ కౌచ్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీరెడ్డి.. ఫిలిమ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. అర్ధ నగ్న ప్రదర్శనకు కరెక్ట్ కాదని.. పోరాటానికి వేరే విధానాన్ని ఎంచుకోవాలని ఇప్పటికే బాలీవుడ్ డేర్ హీరోయిన్ కంగనా రనౌత్ శ్రీరెడ్డికి సూచనలు చేసింది.

 
తాజాగా మరో బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు దిగొచ్చిన పూజా హెగ్డే కూడా లైంగిక వేధింపులపై స్పందించిది. తనకు ఇప్పటివరకు సినీ పరిశ్రమలో వేధింపులు ఎదురుకాలేదని చెప్పింది. అయితే వాటిని ఎదుర్కొనే బాధితులు చెప్తుంటే బాధేస్తుందని పూజా హెగ్డే తెలిపింది. 
 
సినీ ఇండస్ట్రీకి డబ్బుసంపాదన కోసం కొందరు.. నటన మీద ఆసక్తితో కొందరు వస్తుంటారని.. అలాంటివారిని వేధింపులకు గురిచేయడం దారుణమని పూజా హెగ్డే తేల్చేసింది. లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలని.. కానీ అందరూ కలిసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం అనేది వుంటుందని తెలిపింది. ఏ ఒక్కరో చేస్తే పోరాటం కాదని.. ఆ పోరాటానికి పట్టుండదని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ దేశం ఎటువైపు పోతుంది? మహిళలకు రక్షణలేదా : తమన్నా