పవన్ కళ్యాణ్ అన్నా... నన్ను కాపాడన్నా... శ్రీరెడ్డి కన్నీళ్లు(Video)
కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నటి శ్రీరెడ్డి బుధవారం నాడు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి అక్కడ తన గోడును వెళ్లబోసుకుంది. తను రోడ్డుపైకి వచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడటం లే
కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నటి శ్రీరెడ్డి బుధవారం నాడు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి అక్కడ తన గోడును వెళ్లబోసుకుంది. తను రోడ్డుపైకి వచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ సైతం సమావేశాల్లో మాట్లాడుతుంటారనీ, తన విషయం గురించి మాట్లాడటం లేదని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడన్నా అంటూ వేడుకుంది.
టాలీవుడ్‌లో తనలాంటి తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారనీ, తనను ప్రముఖ నిర్మాత కుమారుడు నమ్మించి మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు మద్దతు తెలుపాలంటూ శ్రీరెడ్డి బుధవారం హైదరాబాదు తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లగా అక్కడి జేఎసి నాయకులు ఆమెకు మద్దతు ప్రకటించారు.
శ్రీరెడ్డి చెబుతున్న విషయాల గురించి మహిళాసంఘాలు ఎలా స్పందిచాయంటే...
శ్రీరెడ్డి... తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్‌కి కేంద్ర బిందువైన పేరు. టాలీవుడ్‌లో మహిళపై వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో పచ్చిగా, నిక్కచ్చిగా చెబుతున్నానంటోంది శ్రీరెడ్డి. నిన్నటిదాకా ఆమె చేసిన అర్థనగ్న ప్రదర్శన, ఆమె మాటతీరు ఎన్నో విమర్శలకు కారణం అయ్యింది. అయితే పోను పోనూ శ్రీరెడ్డి లేవనెత్తిన అంశాల గురించి చర్చించడం కూడా ఎక్కువైంది. మహిళా, పౌర హక్కుల సంఘాల నేతలు ఒక్కొక్కరుగా శ్రీరెడ్డి మాట్లాడుతున్న విషయాలపై ఫోకస్ చేయాలంటూ డిమాండ్ చేయడం మొదలెట్టారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకంటూ ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళా సంఘాల నేతలైన సంధ్య, సృజన, ఝాన్సీ, కొండవీటి సత్యవతి మొదలైనవారు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిసారు. ఇండస్ట్రీలో బ్రోకర్ల ఆగడాలను అరికట్టాలని, చిన్నపిల్లలతో లైంగిక సంబంధమైన సీన్లు చిత్రించకుండా చూడాలని కోరారు. ఏదో కమిటీ ఏర్పాటు చేసాం అని మొక్కుబడి తరహాలో కాకుండా, చిత్ర పరిశ్రమలో మహిళలకు రక్షణ లభించే విధంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
సినిమా థియేటర్లు నాలుగు పెద్ద కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయని, వ్యవస్థ ఇలా కేంద్రీకృతం అవ్వడం వల్ల మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని సామాజిక ఉద్యమకారిణి దేవి అన్నారు. సెలెక్షన్ ప్రాసెస్ నుండి, సినిమా పూర్తయ్యేంత వరకూ ఎన్నో రకాల వేధింపులను చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కుంటున్నారనీ, తెగించి కంప్లైంట్ చేయలేకపోతున్నారని, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం వెంటనే ఓ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించారు. వీడియో చూడండి.