Webdunia - Bharat's app for daily news and videos

Install App

సప్తగిరి హీరోగా చిత్రం షూటింగ్ పూర్తి

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (15:54 IST)
ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. 
 
సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. కె. ఎం.కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తన మొదటి సినిమాతో కుమార్ ఒక వైవిధ్యమైన కథను ఎంచుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి సంస్థగా పేరు పొందిన ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు. హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా టైటిల్,  ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేయనున్నారు.  
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్: ప్రతాప్ విద్య

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments