Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సప్తగిరి' పత్రికకు చందాకడితే.. సజీవసువార్త ఉచితం : పోస్టులో పంపిన తితిదే??

Advertiesment
'సప్తగిరి' పత్రికకు చందాకడితే.. సజీవసువార్త ఉచితం : పోస్టులో పంపిన తితిదే??
, సోమవారం, 6 జులై 2020 (18:35 IST)
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న సప్తగిరుల పవిత్రను భక్తులకు తెలిపేందుకు ముద్రిస్తున్న మాసపత్రిక సప్తగిరి. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముద్రిస్తోంది. అయితే, ఈ పత్రిక వేయించుకుంటే.. సజీవసువార్త అనే మాస పత్రికను కూడా తితిదే పంపుతోంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సాక్షాత్ తితిదే మాస పత్రికతో పాటు అన్యమత పత్రికను పంపడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
టీటీడీ పవిత్రతను మంటగలిపేలా ఈ వ్యవహారం ఉందంటున్నారు. టీటీడీకి హైందవదాతలు ఇచ్చే డొనేషన్స్ అన్యమత ప్రచారం కోసం వాడుతోందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో ఓ వ్యక్తికి ‘సప్తగిరి’ అనే మాసపత్రిక వేయించుకుంటే ‘సజీవసువార్త’ అనే ఇంకొక పత్రిక కూడా రావడంతో కలకలం రేగింది.
 
అయితే, తితిదేలో పని చేసే సిబ్బంది ఈ అపచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. మాసపత్రికను చూస్తే టీటీడీ పని తీరు అర్థమవుతోంది. సంవత్సరం చందా కట్టిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా ‘సప్తగిరి’ మాసపత్రికను పంపుతూ ఉంటుంది. 
 
అయితే గుంటూరు నగరంలోని మల్లిఖార్జునరావు పేటకు చెందిన భక్తుడికి ఈ నెల ‘సప్తగిరి’ మాస పత్రిక వచ్చింది. పార్శిల్ తీసి చూడగా ‘సప్తగిరి’ మాసపత్రికతో పాటు ఓ మతానికి సంబంధించిన ‘సజీవసువార్త’ అనే మరొక మాసపత్రిక పార్శిల్ వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా టీటీడీ కొత్తగా అన్యమత ప్రచారం చేయడంపై భక్తుడు అవాక్కయ్యాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణ తొలి సోమవారం.. ఐదు సోమవారాలు.. తూర్పు వైపు నేతితో దీపమెలిగిస్తే?