Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందీలోకి రీమేక్ కానున్న 'నాంది'

Advertiesment
హిందీలోకి రీమేక్ కానున్న 'నాంది'
, శుక్రవారం, 25 జూన్ 2021 (15:18 IST)
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన చిత్రం "నాంది". ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా, వరుస ఫ్లాపులతో కెరీర్‌ను కొనసాగిస్తూ వచ్చిన నరేష్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చినట్టయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. 
 
న్యాయవ్యవస్థలోని లోపాలనేకాకుండా.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చే ప్రేక్షకుల అర్థమయ్యేలా చెప్పిన సినిమా నాంది. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా.. సతీష్ వేగేశ్న నిర్మించారు. 
 
ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ రీమేక్ హక్కులను దిల్ రాజు అప్పుడే సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన ఈ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి మొదలు పెట్టబోతున్నారు.
 
ఈ విషయాన్ని అజయ్ దేవ్‌గన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి "నాంది" సినిమాను రీమేక్ చేయబోతున్నట్లుగా తెలిపారు. ఇక ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌కాష్ రాజ్ నాన్‌లోక‌ల్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగ‌బాబు