మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ముందుగా తాను అధ్యక్షుడిగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు మూడు నెలలుగా కసరత్తు జరుగుతోంది. ఆ తర్వాత మంచు విష్ణు, ఆ తర్వాత జీవిత రాజశేఖర్, హేమ కూడా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఇంతమంది పోటీ పడుతున్నారంటే ఏదో ప్రత్యేకత వుందని ఛానల్స్, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించారు. అందుకే శుక్రవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ముందుగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, నేను నాన్ లోకల్ అనే విషయం తెరపైకి కొందరు తెచ్చారు. వారికి అవగాహనా లోపం మాత్రమే. నటుడికి ఎటువంటి పరిమితులు వుండదు. నేను మా కు మంచి చేద్దామని ఇప్పుడు పోటీ చేస్తున్నా. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఏకగ్రీవం వుండదు. అందుకే ముందుగా చిరంజీవిగారిని కూడా కలిసి వివరించాను. ఆయన కూడా నలుగురికి మంచి చేద్దామనుకుంటే నేను అండగా వుంటానని తెలిపారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ, ప్రకాష్‌రాజ్ నాన్ లోకల్ అనేది విషయం కాదు. అమెరికా అధ్యక్షుడిగా కూడా అక్కడ పౌరసత్వం వుంటే పోటీకి నిలబడవచ్చు.అలాగే మన ఇండియన్ మహిళా కూడా అక్కడ నిలబడి సంచలన సృష్టించింది. కనుక ఇలాంటి విషయాలు తెరపైకి తేవద్దు అని సూచించారు.ప్రకాష్ రాజ్ హైదరాబాద్‌లోనే ఉంటూ ఏన్నో సమాజిక పనులు చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ఎంతోమందికి పని కల్పించారు.ఎంతో మంది ఆదుకున్నారు. ఆయనకే మా మద్దతు అంటూ తేల్చిచెప్పారు.ఈ కార్య్రకమంలో ప్రకాష్ రాజ్ పేనల్ సభ్యులు పాల్గొన్నారు.