Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స‌ప్త‌గిరి హీరోగా 'ఎయిట్' ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

స‌ప్త‌గిరి హీరోగా 'ఎయిట్' ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌
, శుక్రవారం, 1 జనవరి 2021 (19:55 IST)
స‌ప్త‌గిరి క‌థానాయ‌కుడిగా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 4గా రూపొంద‌నున్న చిత్రం 'ఎయిట్‌'. సూర్యాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ బ‌హుభాషా చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు.
 
యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావ‌డం వ‌ల్లే నాలుగు భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ఇల్యూజ‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తుండ‌గా, ఖుషి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈరోజు 'ఎయిట్‌'లో స‌ప్త‌గిరి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇన్‌టెన్స్ లుక్‌లో స‌ప్త‌గిరి ఆక‌ట్టుకుంటున్నారు. కోటు ధ‌రించి ఉన్న స‌ప్త‌గిరి స్టైల్‌గా సిగ‌రెట్ తాగుతుండ‌గా, చేతికి ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపిస్తున్నాయి.
 
స‌ప్త‌గిరికి ఉన్న ఇమేజ్‌కు త‌గిన‌ట్లు చిత్రంలో వినోదానికి పెద్ద‌పీట వేస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.
 
ఎన్‌.ఎస్‌. ప్ర‌సు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి న‌జీర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, వంశీ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప‌నిచేసే తారాగ‌ణం, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.
 
క‌ల్యాణ్ దేవ్‌, సుంద‌రి, పూర్ణ ప్ర‌ధాన పాత్రధారులుగా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న మ‌రో చిత్రం 'సూప‌ర్ మ‌చ్చి' త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
 
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కత్వం: సూర్యాస్‌
నిర్మాత‌: రిజ్వాన్‌
బ్యాన‌ర్‌: రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
స‌హ నిర్మాత‌: ఖుషి
మ్యూజిక్‌: ఎన్‌.ఎస్‌. ప్ర‌సు
సినిమాటోగ్ర‌ఫీ: న‌జీర్‌
ఎడిటింగ్‌: వ‌ంశీ
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రేజ్ ఉన్నా ఛాన్సులు నిల్ :: ప్లీజ్... ఒక్క ఛాన్స్ అంటున్న హీరోయిన్లు...