ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో రష్మిక మందన్న

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:40 IST)
ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాను వెల్లడించింది. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది అసాధారణ వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ '30 అండర్ 30' జాబితాలో రష్మిక మందన్న కూడా చోటు దక్కించుకుంది. 
 
ఈ నేపథ్యంలో రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ రష్మిక మందన్నను సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ అభినందించారు. ఈ ఏడాది ఈ జాబితాలో రష్మిక మందన్నతో పాటు మరో ముగ్గురు నటీమణులు చోటు దక్కించుకున్నారు. 
 
ఈ గుర్తింపుపై రష్మిక తొలిసారి సోషల్ మీడియాలో స్పందించింది. మ్యాగజైన్ కవర్ ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆమె తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
 
 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే జ్యోతి యర్రాజీ, పరుల్ చౌదరి క్రీడాకారులు క్రీడా విభాగంలో, రాధికా మదన్, రష్మిక మందన్న వినోద విభాగంలో చోటు సంపాదించుకున్నారు.
 
ఇకపోతే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వం వహించే పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. రష్మిక చివరిగా హిందీలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్‌లో కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments