Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప 2 సెట్లో దర్శకుడు సుకుమార్ స్టయిల్ ని శ్రీవల్లి పట్టుకుంది

Advertiesment
sukumar style

డీవీ

, సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (15:47 IST)
sukumar style
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రం షూట్ జరుగుతుంది. ఇటీవలే అందులో జాయిన్ అయిన శ్రీవల్లి పాత్రధారిణి రష్మిక మందన్న ఓ ఫొటోను షేర్ చేసింది. సుకుమార్ ఓ సన్నివేశాన్ని చూస్తూ సింహం బొమ్మపై చేతులేసి ఒదిగి వుండగా తన ఫోన్ కెమెరాతో క్లిక్ చేసి అభిమానులకు షేర్ చేసింది. 
 
కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రాన్ని షేర్ చేసింది, నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతతం ఈ సినిమా  శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అనుకన్న టైంకు 15 AUG 2024న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దేవీశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫాహద్ ఫజిల్ నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినూత్నంగా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు సినిమా పోస్టర్