Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి ఈజ్ బ్యాక్ ఆ ఒక్కటీ అడక్కు అంటున్న నరేష్

డీవీ
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:23 IST)
Aa Okti Adakku
అల్లరి ఈజ్ బ్యాక్. అల్లరి నరేష్ తన గత కొన్ని సినిమాలలో కొన్ని సీరియస్ సబ్జెక్ట్‌లను ప్రయత్నించి తన బిగ్గెస్ట్ ఫోర్ట్ - కామెడీకి తిరిగి వచ్చారు. తన 61వ సినిమా కోసం డెబ్యు డైరెక్టర్ మల్లి అంకంతో చేతులు కలిపారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత.
 
ఈ రోజు, మేకర్స్ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేసారు. అల్లరి నరేష్ ఫాదర్ ఈవీవీ సత్యనారాయణ కెరీర్ లో ఎపిక్ హిట్ గా నిలిచిన చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు',  ఈ పేరుని ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టారు. అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేయడంతో పాటు, సినిమా ప్రిమైజ్ ని గ్లింప్స్ ఆసక్తికరంగా పరిచయం చేసింది  
 
అల్లరి నరేష్ పాత్ర పేరు గణ, అతని పెళ్లి గురించి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అడుగుతారు. టైటిల్‌ను రివిల్ చేస్తూ “ఆ ఒక్కటీ అడక్కు…” అని వారికి సమాధానమిచ్చాడు. పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య అని చెప్తాడు, అయితే సినిమా తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది. టైటిల్ లాగే, గ్లింప్స్ హిలేరియస్ గా నవ్వులుపూయించింది.
 
ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
అబ్బూరి రవి రైటర్, సూర్య డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
 
ఈ చిత్రాన్ని మార్చి 22, 2024న విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments