Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏదో ఒక రోజు రాజమౌళి గారి సినిమాలో భాగం కావాలి : హీరోయిన్ ఆషిక రంగనాథ్

Advertiesment
Aashika Ranganath

డీవీ

, మంగళవారం, 9 జనవరి 2024 (18:12 IST)
Aashika Ranganath
దర్శకుడు విజయ్ బిన్నీ నాగార్జున అక్కినేని నా సామిరంగ  ప్రాజెక్ట్ గురించి చెప్పినపుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను. నాలాంటి న్యూ కమ్మర్ కి నాగార్జున గారు లాంటి బిగ్ స్టార్ తో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఇందులో వరాలు అనే పాత్రలో కనిపిస్తాను. నా పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత వుంది. రెండు వేరియేషన్స్ లో నా పాత్ర కనిపిస్తుంది. పాత్రపై చాలా నమ్మకంగా వున్నాను. తప్పకుండా వరాలు పాత్ర అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది అని హీరోయిన్ ఆషిక రంగనాథ్ అన్నారు. జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల నేపధ్యంలో ఆమె చిత్ర విశేషాల్ని తెలిపారు. 
 
మీ పాత్రలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
-వరాలు చాలా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథానాయికల పాత్రలు కొంచెం సున్నితంగా వుంటాయి. కానీ వరాలు పాత్ర మాత్రం రెబల్. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి అంటే ఇలా వుండాలనే భావన కలిగించే పాత్ర ఇది. అలాంటి పాత్ర చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. నా సామిరంగ తెలుగుదనం ఉట్టిపడే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.
 
నాగార్జున గారితో వర్క్  చేయడం ఎలా అనిపించింది ?
-నాగార్జున గారితో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి. నాగార్జున గారు ఛార్మింగ్, అమెజింగ్ పెర్ఫార్మర్. అలాంటి పెద్ద స్టార్ తో పని చేయడం నిజంగా నా అదృష్టం. నాగార్జున గారు చాలా స్వీట్ పర్సన్. అంత పెద్ద స్టార్ వున్న ఈ చిత్రంలో వరాలు లాంటి అద్భుతమైన పాత్ర దక్కడం చాలా లక్కీగా ఫీలౌతున్నాను.
 
ఇందులో నాగార్జున గారి పాత్రకు, మీ పాత్రకు మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ?
నాగార్జున గారు రొమాంటిక్ హీరో. ఈ చిత్రంలో కూడా కథకు అనుగుణంగా మా పాత్రల మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ వున్నాయి. అలాగే ఇందులో అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ పాత్రలకు కూడా ప్రత్యేకమైన రొమాంటిక్ స్టొరీస్ వున్నాయి. పాత్రలన్నీ చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇందులో నరేష్, రాజ్ తరుణ్ తో చాలా మంచి కాంబినేషన్ సీన్స్ వున్నాయి. అవన్నీ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచుతాయి.
 
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
కీరవాణి గారు స్వరపరిచిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా అనేక చిత్రాలు చూశాను. ఆయన పాటలు విన్నాను. ఆయన లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో భాగం కావడం చాలా అనందంగా వుంది. నా సామిరంగలో పాటలన్నీ అద్భుతంగా వుంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు అన్ని వైపుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది.
 
డైరెక్టర్ విజయ్ బిన్నీ గురించి ?
విజయ్ బిన్నీ గారు కొత్త దర్శకుడిలా అనిపించలేదు. చాలా అనుభవం వున్న దర్శకుడిలా సినిమాని తీర్చిదిద్దారు. ఆయన నిర్ణయాలని చాలా త్వరగా తీసుకుంటారు. అలాగే ప్రతి విషయంపై చాలా క్లారిటీ వుంటుంది.
 
తెలుగు కల్చర్ ఎలా అనిపించింది ? భాష పరంగా ఎలా ప్రిపేర్ అయ్యారు ?
తెలుగు, కన్నడ కల్చర్స్ సిమిలర్ గానే వుంటాయి. తెలుగు భాష మాత్రం నాకు కొత్త. రైటర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేశారు. వాయిస్ నోట్స్ ని బాగా ప్రాక్టీస్ చేశాను. ఈ ప్రక్రియని చాలా ఎంజాయ్ చేశాను.
 
మిమ్మల్ని చాలామంది జూనియర్ అనుష్క పిలుస్తారు కదా.. ఎలా అనిపిస్తుంటుంది ?
అనుష్క గారు అంటే నాకు చాలా ఇష్టం. అద్భుతమైన చిత్రాలు, పాత్రలు చేశారు. ఆమెతో పోల్చడం ఆనందమే (నవ్వుతూ)
 
మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. అలాగే పిరియాడిక్ ఫిల్మ్ చేయాలనే డ్రీమ్ వుంది. ఏదో ఒక రోజు రాజమౌళి గారి సినిమాలో భాగం కావాలని బలంగా కోరుకుంటున్నాను. 
 
కొత్త సినిమాలు గురించి ?
తమిళ్ లో హీరో సిద్ధార్ తో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే కన్నడలో ఓ రెండు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు- రాజమౌళి చిత్రంలో ఇండోనేషియా నటి?