Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జోజు జార్జ్ పాత్రను దించేసిన నాగార్జున అక్కినేని

Advertiesment
Nagarjuna Akkineni

డీవీ

, సోమవారం, 8 జనవరి 2024 (12:09 IST)
Nagarjuna Akkineni
నాగార్జున అక్కినేని నటించిన తాజా సినిమా  ‘నా సామిరంగ’. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 9 న విడుదల చేస్తున్నట్లు చిత్ర టీమ్ ప్రకటించింది. ఇప్పటికే ప్రమోషన్ మొదలెట్టగా ఈ దర్శకుడు, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమా మాత్రుక పొరింజు మరియం జోస్ అనేది తెలియజేశారు. అందులో జోజు జార్జ్ పాత్రను దించేసిన నాగార్జున అక్కినేని చేశారు. సినిమా మొదట్లోనే యాక్షన్ సీన్ కత్తులతో దాడిచేయడం మామూలుగా వుండదు. నరకడమే నరకడం. 
 
ఈ రోజు మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కత్తి పట్టుకొని మ్యాసీ లుక్ కనిపించారు నాగార్జున. మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. 
 
ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయ్యిందా?