నాగార్జునతో కలిసి నా సామిరంగాలో అషికా రంగనాథ్ నటించింది. మలయాళం మాత్రుకలో పాత్ర తరహాలో తనది వుంటుందనీ, చాలా రెబల్ గా వుంటాను. కానీ అందులో వున్నట్లు సిగరెట్లు, మందు తాగను అని చెప్పింది. ఒరిజనల్ వర్షన్ చూశాను. దర్శకుడు విజయ్ చాలా మార్పలు చేశారు అని అన్నారు.
సంక్రాంతి ఈ సినిమా విడుదల కాబోతుంది. దీని గురించి మాట్లాడుతూ, సంక్రాంతికి అంతా కన్నడ నటీమణులే తెలుగులో హవా నడుస్తోంది. అన్ని సినిమాల్లోనూ కన్నడ వారే హీరోయిన్లుగా వున్నారు. ఇక నాకు అనుష్క అంటే చాలా ఇష్టం. ఫీచర్ లో అనుష్క బయోపిక్ ఎవరైనా చేస్తే నేను నటిస్తాను అంది. రాజమౌళి వంటి దర్శకుడితో పనిచేయాలనుందని చెప్పింది.