Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RangasthalamTeaser చిట్టిబాబుగా చెర్రీ అదరగొట్టేశాడు (వీడియో)

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుండిన ''రంగస్థలం'' టీజర్ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, సమంత, ఆదిపినిశెట్టి, అనసూయ, జగ

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (16:37 IST)
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుండిన ''రంగస్థలం'' టీజర్ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, సమంత, ఆదిపినిశెట్టి, అనసూయ, జగపతి బాబు, గౌతమి తదితరులు నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాతలు. 
 
ఈ చిత్రంలో ఓ స్పెషల్ పాటకు పూజా హెగ్డే చిందులేయనుంది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ బోయపాటి శీను చిత్రంలో నటించనున్నాడు. ఆపై ఎన్టీఆర్‌తో ఎస్ఎస్ రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ నటిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రానికి చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే.. తాజాగా విడుదలైన ''రంగస్థలం'' ట్రైలర్‌లో అదిరిపోయే లుక్‌లో చెర్రీ కనిపించాడు. 
 
చిట్టిబాబుగా చెర్రీ లుక్ బాగుంది. మా ఊర్లో అందరూ తనను సౌండ్ ఇంజనీర్‌గా పిలుస్తారనే డైలాగ్, ఊరి పేరు రంగస్థలం అంటూ సాగే మాటలు బాగున్నాయి. చివర్లో చెర్రీ కొడవలి చేత పట్టుకుని వస్తున్న సన్నివేశం అదుర్స్ అనిపిస్తోంది.

''అందరికీ సౌండ్ వినబడద్దండి.. నాకు సౌండ్ కనబడద్దండి.. అందుకే నన్ను సౌండ్ ఇంజనీర్ అంటారండి'' అంటూ చెర్రీ చెప్పే డైలాగ్స్‌ను బట్టి అతను డఫ్ రోల్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. తప్పకుండా రంగస్థలం టీజర్ మెగా ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్‌ ఇస్తుందని సినీ పండితులు చెప్తున్నారు. ఇంకేముంది.. రంగస్థలం ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments