Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగ్ బడ్జెట్: చెర్రీ-ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమాకు రూ.90కోట్లు

బాహుబలి మేకర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌పై కసరత్తు జరుగుతోంది. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలకు కొటేషన్ కూడ

Advertiesment
షాకింగ్ బడ్జెట్: చెర్రీ-ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమాకు రూ.90కోట్లు
, బుధవారం, 17 జనవరి 2018 (13:08 IST)
బాహుబలి మేకర్ రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చెర్రీ కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌పై కసరత్తు జరుగుతోంది. తాజాగా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి నిర్మాతలకు కొటేషన్ కూడా పంపినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ కొటేషన్ ప్రకారం చెర్రీ, ఎన్టీఆర్ సినిమా బడ్జెట్  రూ.90కోట్ల వరకు వుంటుందని సమాచారం. 
 
కానీ ఇందులో రాజమౌళి, చెర్రీ, ఎన్టీఆర్‌ల పారితోషికాలు లేవు. మిగిలిన ఖర్చులన్నింటినీ కలుపుకుని రూ.90కోట్లు ఖర్చవుతుందని రాజమౌళి నిర్మాతలకు తెలియజేసినట్లు టాక్ వస్తోంది. ఈ చిత్రంలో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా.. యాక్షన్ సీన్స్ వుంటాయని తెలుస్తోంది. 
 
2019 దసరాకి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సీజీఐ పనులు జరుపుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరిచ్చే రెమ్యునరేషన్‌కు అంతా చూపించమంటే ఎలా... ఎవరు..?