Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్-చెర్రీతో రాజమౌళి సినిమా.. సంక్రాంతికి అధికారిక ప్రకటన

ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి సినిమా దృష్టి సారించారు. రాజమౌళి బాహుబలికి తర్వాత ఎన్టీఆర్-చెర్రీతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప

Advertiesment
ఎన్టీఆర్-చెర్రీతో రాజమౌళి సినిమా.. సంక్రాంతికి అధికారిక ప్రకటన
, బుధవారం, 3 జనవరి 2018 (16:43 IST)
ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి సినిమా దృష్టి సారించారు. రాజమౌళి బాహుబలికి తర్వాత ఎన్టీఆర్-చెర్రీతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత వుంటుందని ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇకపోతే.. ఈ సినిమాపై అధికార ప్రకటన కోసం రాజమౌళి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దర్శకధీరుడు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతికి అధికారిక ప్రకటన చేసే ఈ మల్టీస్టారర్ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌పైకి రానుంది. దాదాపు పదినెలల పాటు నిర్విరామంగా ఈ షూటింగ్ జరుగుతుందని టాక్. 
 
ఇందులో భాగంగా బోయపాటితో చరణ్ .. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేసే సినిమాలు, అక్టోబర్ నాటికి పూర్తయ్యేలా చూసుకోమని ఇద్దరు హీరోలకి రాజమౌళి చెప్పారని సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ల కోసం రాజమౌళి వేట మొదలెట్టారని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ చెప్పులు తుడవడానికి కూడా పనికిరావు... కత్తి మహేష్‌పై రేణు దేశాయ్ ఫైర్