Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బన్నీ జోరుకి రామ్‌ చరణ్ బేజారు..

2018 కొత్త సంవత్సరం ప్రారంభంతోనే మెగా హీరోల జోరు మొదలైపోయింది. ఒకప్రక్క సంక్రాంతికి పవన్‌ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'గా సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా, ఫిబ్రవరి నెలలో వరుణ్ తేజ 'తొలిప్రేమ' సినిమాతో వస్తున్నా

బన్నీ జోరుకి రామ్‌ చరణ్ బేజారు..
, శుక్రవారం, 5 జనవరి 2018 (16:15 IST)
2018 కొత్త సంవత్సరం ప్రారంభంతోనే మెగా హీరోల జోరు మొదలైపోయింది. ఒకప్రక్క సంక్రాంతికి పవన్‌ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'గా సందడి చేయడానికి సిద్ధంగా ఉండగా, ఫిబ్రవరి నెలలో వరుణ్ తేజ 'తొలిప్రేమ' సినిమాతో వస్తున్నాడు. మరోవైపు మెగా పవర్‍ స్టార్ రామ్‌చరణ్ 'రంగస్థలం' సినిమాతో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తుంది.
 
1980 దశకం నాటి కథతో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరక్కెక్కిస్తున్నాడు. గతేడాది రామ్ చరణ్ ఒక్కసినిమాను కూడా రిలీజ్ చేయలేదు. 2016 డిసెంబర్‌లో వచ్చిన 'ధృవ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, సినిమాలు లేక ఒక్క ఏడాది గ్యాప్ రావడంతో అభిమానులు తదుపరి చిత్రంపై ఆత్రుతగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌లు మాత్రమే రిలీజయ్యాయి. 
 
మరోపక్క అల్లు అర్జున్ తన 'డిజే' సినిమా డిజాస్టర్ నుండి తేరుకొని 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అంటూ నూతన సంవత్సరాది కానుకగా మొదటి ఇంపాక్ట్ టీజర్‌ని విడుదల చేసాడు. అది ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఏప్రిల్ 27వ తేదీన రిలీజ్ కానుందని డేట్ కూడా ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్. సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టాడు బన్నీ. 
 
ఈ చిత్రంతో కథా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారాడు. ఇప్పుడు రామ్‌చరణ్ తన సినిమా ప్రమోషన్‌ని స్టార్ట్ చేయడానికి ముందే బన్నీ ఒక్క అడుగు ముందుకేసి తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక బన్నీ స్ట్రాటజీకి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మెగా ఫ్యామిలీ నుండి వరుస సినిమాలతో ఈ సంవత్సరం బాక్సాఫీస్ కళకళలాడబోతోందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోయ్‌ఫ్రెండుతో ఒక రాత్రి గడిపేసిన సెక్సీ నటి శ్రుతి హాసన్