Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సెల్వి
మంగళవారం, 21 మే 2024 (15:15 IST)
రావణుడు శ్రీలంకకు రాజు. అతడు సుసంపన్నుడు. రాజ్యంలో బంగారానికి ఏమాత్రం కొదువ వుండదు. ఆ కాలంలో బంగారంతో తయారైన దుస్తులను రాజులు ధరించేవారని చెప్తారు. ఈ క్రమంలో రావణుడు కూడా బంగారు దుస్తులు ధరించేవాడట. అయితే కలియుగంలో రావణుడి పాత్రను పోషించే యష్ కూడా ప్రస్తుతం బంగారు దుస్తులు ధరించబోతున్నాడట.
 
రాబోయే బాలీవుడ్ చిత్రం "రామాయణం" అద్భుతమైన దృశ్యమానంగా ఉంటుందని ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ హామీ ఇచ్చింది. ఈ చిత్రంలో రావణుడి పాత్రను కేజీఎఫ్ హీరో యష్ పోషిస్తున్నాడు. ఈ పాత్రకు తగినట్లు నిజమైన బంగారు నగలు, దుస్తులలో రావణుడిలా యష్ మెరిసిపోనున్నాడు. ఈ వేషాలంకరణ రావణుడి అపారమైన సంపద, శక్తిని ప్రతిబింబిస్తుంది.
 
ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్ మరియు సీతగా సాయి పల్లవి కూడా నటించారు. ఇందులో కైకేయిగా నటి లారా దత్తా, దశరథుడిగా అరుణ్ గోవిల్ కూడా ఉన్నారు.
 
'పద్మావత్‌', 'హౌస్‌ఫుల్‌ 4', 'హీరమండి: ది డైమండ్‌ బజార్‌' సిరీస్‌ వంటి చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ తయారు చేసిన డిజైనర్‌ ద్వయం రింపుల్‌, హర్‌ప్రీత్‌లు 'రామాయణం' కోసం డిజైనర్లుగా మారారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments