Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమకథతో సిద్దమైన ప్రేమించొద్దు చిత్రం

Advertiesment
preminchotddu janta

డీవీ

, గురువారం, 9 మే 2024 (10:56 IST)
preminchotddu janta
శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  పాన్ ఇండియా చిత్రంగా 5  భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని  జూన్ 7న  విడుదల చేస్తున్నారు మేకర్స్.
 
చిత్ర దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణం లో  ‘ప్రేమించొద్దు’ అనే శీర్షిక తో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను  జూన్ 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 
 
నటీనటులు:అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు
 
సాంకేతిక వర్గం:  రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం - శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే - షిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, లొకేషన్ సౌండ్ - మహేష్ పాశం, డబ్బింగ్ ఇంజనీర్ - అనూప్ చౌదరి, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌:  నిఖిలేష్ తొగ‌రి, పి.ఆర్.ఒ - చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండేల్ నుంచి సాయి పల్లవి స్పెషల్ పోస్టర్ విడుదల