Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ లుక్‌కు ఫిదా అయిన రామ్ గోపాల్ వర్మ..

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (11:25 IST)
''మహానటి'' హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన 27వ పుట్టినరోజున జరుపుకుంది. ఈ సందర్భంగా కీర్తి నటిస్తోన్న ఓ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నగేష్ కకునూర్ దర్శత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన కీర్తి లుక్‌పై సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 
 
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ.. ట్విట్టర్‌ వేదికగా రాస్తూ.. కీర్తి లుక్‌కు ఫిదా అయ్యానని.. ఆ లుక్‌లో కీర్తి అదిరిపోయిందని.. విభిన్న కథలతో కీర్తి  అదరగొడుతోందని తెలుపుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశాడు. 
 
కాగా నేను శైలజా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తర్వాత నాని ‘నేను లోకల్’ సినిమాలో నటించింది. ఆపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ''మహానటి'' లో నటించింది. అయితే మహానటి సినిమా కీర్తి సురేష్ నట జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. 
 
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారం లభించింది. మహానటి తర్వాత కీర్తి సురేష్ తెలుగులో  నాగార్జున ‘మన్మథుడు 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'పెంగ్విన్' సినిమాలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments