విక్టరీ వెంకీ, అక్కినేని వారసుడు నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి వెంకీ-పాయల్, చైతూ-రాశి ఖన్నా లుక్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో ట్రాక్టర్‌ను వెంకీ నడుపుతుండగా, రాశి ఖన్నా, చైతూ, పాయల్ ట్రాక్టర్‌లో వున్న లుక్ అదిరింది. ఈ లుక్‌ను మీరూ ఓ లుక్కేయండి.