వినాయక్ మాస్ లుక్.. సీనయ్యగా వస్తోన్న వీవీవీ

గురువారం, 10 అక్టోబరు 2019 (16:05 IST)
వివి వినాయక్ నటుడి అవతారం ఎత్తాడు. తాజాగా అతడు హీరోగా నటించే సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ లుక్‌లో వినాయక్ స్టైల్ అదిరింది. వివినాయక్ దర్శకుడిగా అనేక సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్, దిల్ రీసెంట్‌గా ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలు వినాయక్ తీసిన సినిమాల్లో ఉత్తమ చిత్రాలని చెప్పవచ్చు. 
 
ప్రస్తుతం ఈ దర్శకుడు హీరోగా మారిపోయాడు. దిల్ రాజు నిర్మాణంలో వివి వినాయక్ టైటిల్ పాత్రలో ''సీనయ్య'' అనే సినిమా చేస్తున్నారు. టైటిల్ క్లాస్‌గా ఉన్నా ఆ టైటిల్‌ను డిజైన్ చేసిన విధానం పక్కా మాస్‌గా కనిపిస్తోంది.  
 
వినాయక్ లుక్ సైతం అంతే మాస్‌గా ఉన్నది. చేతిలో ఓ రెంచ్, మెడలో రెడ్ కలర్ టవల్‌తో సీరియస్ లుక్‌లో వున్న ఫోటో ప్రస్తుతం రిలీజ్ అయ్యింది.  వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. 
 
శరభ సినిమాకు దర్శకత్వం వహించిన నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఇంకేముంది.. దర్శకుడిగా తన సత్తా చాటిన వినాయక్.. నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం టాలీవుడ్‌లో పవర్ స్టార్ వారసుడు.. ''సైరా'' తర్వాత అకీరాతో చెర్రీ సినిమా?