Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నన్నలా చూసి నా పేరెంట్స్ షాకయ్యారు: అవికా గోర్ ఇంటర్వ్యూ

నన్నలా చూసి నా పేరెంట్స్ షాకయ్యారు: అవికా గోర్ ఇంటర్వ్యూ
, మంగళవారం, 15 అక్టోబరు 2019 (15:31 IST)
చిన్నారి పెళ్లికూతురు’గా ప‌రిచ‌య‌మై... ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది అవికా గోర్. ప్రస్తుతం ‘రాజు గారు గది 3’ చిత్రంలో న‌టిస్తుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పైన హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘అవికా గోర్’తో ఇంట‌ర్వ్యూ మీ కోసం..
 
తెలుగులో చాల గ్యాప్ తర్వాత వస్తున్నారు క‌దా. గ్యాప్ రావ‌డానికి కార‌ణం..?
తెలుగులో ఆఫ‌ర్స్ వ‌చ్చాయి కానీ... హిందీ సినిమాలు చేయడం, ముఖ్యంగా ఒకే రకమైన సినిమాలు రావడంతో తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను.
 
‘రాజుగారి గది 3’ సినిమా చేయ‌డానికి మెయిన్ రీజ‌న్ ఏంటి..?
ఈ సినిమా దర్శకుడు ఓంకార్ గారే. ఆయన తమన్నా అనుకుని రాసుకున్న పాత్రలో నేను అయితే బాగా చేస్తానని నమ్మారు. ఆయన కథ చెప్పినప్పుడే నాకు కథ బాగా నచ్చింది. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.
 
హారర్ సినిమాలో మొదటిసారి నటించారు క‌దా! ఎలా అనిపించింది?
పర్సనల్‌గా నేను ఒంటరిగా హారర్ ఫిల్మ్స్ అసలు చూడను. ఒకవేళ చూసిన పక్కన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఉంటేనే చూస్తాను. అలాంటిది ఓంకార్ గారు నాకు ఈ హారర్ కథ చెబుతున్నప్పుడే టెన్షన్ పడ్డాను. కానీ కథలో మంచి కామెడీ ఉంటుంది. కథ వింటున్న అన్నంతసేపూ నేను నవ్వుతూనే ఉన్నాను.
 
పోస్టర్ లోనే మీ లుక్ చాల భయం కలిగించేలా ఉంది?
మేకప్ వేసుకునప్పుడే నన్ను నేను చూసుకుంటున్నాను. పోస్టర్లో చూసినప్పుడు నాకు మామూలుగానే ఉంది. అయితే ఆ లుక్ లో నన్ను చూసి మా పేరెంట్స్ షాక్ అయ్యారు. కానీ కథ తెలిసాక మళ్ళీ కామ్ అయ్యారు.
 
మీ క్యారెక్టర్ గురించి?
సినిమాలో నా క్యారెక్టర్ వెరీ సింపుల్… గర్ల్ నెక్స్ట్ డోర్‌లా ఉంటుంది.
 
ఈ సినిమాలో బాగా ఆకట్టుకునే అంశాలు ఏమిటి?
ఈ సినిమాలో కామెడీ చాల కొత్తగా అలాగే అద్భుతంగా ఉంటుంది. సినిమా చూస్తూ ఉన్నంత సేపూ కామెడీని మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అలాగే సినిమాలో డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఇలా అన్ని బాగుంటాయి. ఒక్క మాటలో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీతో ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాం.
 
తెలుగు డైలాగ్స్ మీకు అర్ధం అవుతాయా?
అర్ధం అవుతాయి కానీ, త్వరగా మాట్లాడలేను.
 
తమన్నా చేయాల్సిన పాత్రను మీరు చేశారు. నటనలో ఆమెతో పోల్చి చూస్తారనే టెన్షన్ ఉందా ?
లేదండి. ఏ క్యారెక్టర్ అయినా దాన్ని ఎవరు చేసినా దర్శకుడి అభిరుచికి తగ్గట్లే చేస్తారు. కాకపోతే, ఎవరి శైలి వారిది. నా వరకూ నేను ఈ సినిమా కోసం సిన్సియర్‌గా వర్క్ చేశాను. అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.
 
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి..?
బాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నాను, అలాగే హిందీ టీవీలో కూడా చేస్తున్నాను. ఇక నుండి తెలుగు మూవీస్ ఎక్కువుగా చేయాల‌నుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయనతారకు బాగా ఎక్కింది, ఆ హీరో వస్తే కాలు మీద కాలేసుకుని కుర్చీలో నుంచి లేవలేదట...